శ్రీముఖి ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ ఫస్ట్‌లుక్‌


హాట్‌ యాంకర్ శ్రీముఖి నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. ఇవాళ శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్‌ చేసింది. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, కాక్‌టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, ఈవీఎస్ గౌతమ్ నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న గౌతమ్ ఈవీఎస్ మాట్లాడుతూ, ఈ చిత్రం సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అని, నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో యూత్‌ జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుందని, ఈ సినిమాలో శ్రీముఖి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు కానీ, ఆమెది చాలా కీలకమైన పాత్ర అని తెలిపారు.