శ్రీవిష్ణు కొత్త చిత్రం!

2016 చివ‌రిలో మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న “అప్ప‌ట్లో ఓక‌డుండేవాడు” లాంటి న్యూవేవ్ మూవీతో గ‌త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికిన యంగ్ హీరో శ్రీవిష్ణు మ‌రియు ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్ద‌రు పాపుల‌ర్ హీరో, హీరోయిన్స్  కాంబినేష‌న్ లో కాన్సెప్టెడ్ మ‌ల్టిస్టార‌ర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర‌సేన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. బాబా క్రియోష‌న్స్‌ బ్యాన‌ర్ పై డా. ఎం.వి.కె రెడ్డిగారు స‌మ‌ర్ప‌ణ‌లో అప్పారావు బెల్లాన‌ నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి లో సెట్స్ మీద‌కి వెల్ల‌నుంది. 
 
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన మాట్లాడుతూ..” ఈ చిత్రం రెగ్యుల‌ర్ క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల కంటే భిన్నంగా  వుంటుంది. కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో కంప్లీట్ వెస్ట్ర‌న్ మూవీస్ బాట‌లో సాగుతుంది. ఈ చిత్రం లో స‌మాంత‌రంగా సాగే మూడు క‌థ‌లుంటాయి. అందులో వుండే మూడు మిస్ట‌రీస్ ని చేధించ‌డం మీద ఈ క‌థ ఆధార‌ప‌డి వుంటుంది. ఇది రొల‌ర్ కాస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మిగతా వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాం..” అని అన్నారు