HomeTelugu Trending'శ్రీదేవి సోడా సెంటర్‌' ట్రైలర్‌

‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ట్రైలర్‌

Sridevi Soda Center Trailer
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించారు. కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సూరిబాబు – శ్రీదేవి అనే జంట మధ్య సాగే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్‌ల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదలైంది. మహేశ్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన ఆటపాటలు .. అల్లరి చూపిస్తూ వచ్చారు. కానీ ఈ సారి రొమాన్స్ తో పాటు యాక్షన్ .. ఎమోషన్ చూపించారు. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్ ను .. మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!