నాన్న దానికి మినహాయింపు కాదు!

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న శృతిహాసన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టాప్ హీరోల సరసన ఆఫర్స్ తో పాటు వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. 2016వ సంవత్సరంలో చాలా విషయాలు నేర్చుకున్నానని.. వృత్తిపరంగా మరో మెట్టు ఎక్కానని 
చెబుతోంది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలపై కూడా అమ్మడు స్పందించింది. ఈ సంవత్సరంలో వచ్చిన హాట్ న్యూస్ లో గౌతమి, కమల్ ల బ్రేకప్ కూడా ఒకటి. పదమూడేళ్ళ వాళ్ళ బంధం తెగిపోవడానికి కారణం శృతిహాసన్ అంటూ… చాలా కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై గౌతమి, శృతి ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.
అయితే మొదట నుండి కమల్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడని శృతి ఇప్పుడు కూడా అదే చేస్తోంది. ఒకరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడానికి నేనెవరిని.. నాన్న కూడా దానికి మినహాయింపు కాదు గనుక ఇతరుల విషయాల గురించి నన్ను ప్రశ్నించొద్దని క్లియర్ కట్ గా చెప్పేసింది. ప్రస్తుతం శృతి తన తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఆర్టిస్ట్ గా ఆయన ఎంతో గొప్ప వారని చెబుతూ.. తన కూతురిని కాకపోయినా.. ఇలానే గౌరవించేదాన్ని అంటూ వెల్లడించారు.