సంక్రాంతి సినిమాలన్నీ హిట్ అవ్వాలంటోంది!

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శ్రియ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇప్పటివరకు తను ఇలాంటి సినిమాల్లో నటించింది లేదని అమ్మడు చెబుతోంది. ”క్రిష్ కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నా. వశిష్ట దేవి అనే నా పాత్ర అన్నీ బాగా నచ్చాయి. ఇలాంటి ఒక హిస్టారికల్ సినిమాలో మంచి
పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. మొదట్లో చేయగలనో లేదో అనుకున్నాను. కానీ క్రిష్ ను, బాలయ్యను చూసి ధైర్యం వచ్చింది. క్రిష్ పక్కా ప్లానింగ్ తో సినిమా చేశాడు. నేను హిస్టరీ స్టూడెంట్ అయినా.. నాకు శాతకర్ణి గురించి పెద్దగా తెలియదు.

కానీ ఆయన గురించి సినిమాలో నటిస్తున్నప్పుడు తెలుసుకొని గర్వ పడ్డాను. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. మా సినిమాతో పాటు మరో పెద్ద సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. పోటీ అనేది సినిమాల మధ్యన ఎప్పుడూ ఉంటుంది. ఏ సినిమాకైనా అందరం కష్టపడి పనిచేస్తాం. కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను ఈ సినిమాలో నటించాను కాబట్టి మా సినిమా ఇంకొంచెం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా(నవ్వుతూ) అన్నారు.