HomeTelugu Trending'కరోనా' ప్రపంచాన్ని కుదిపేస్తుంది: రాజమౌళి ట్వీట్‌

‘కరోనా’ ప్రపంచాన్ని కుదిపేస్తుంది: రాజమౌళి ట్వీట్‌

2 15
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టుకుని కుదిపేస్తోంది. దీనిపై టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు . ప్రజలను భయపెట్టే ప్రచారాలను నిలిపి వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందరూ పాటించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం రాజమౌళి న్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu