బయోపిక్‌లో మోడీగా ప్రముఖ నటుడు..!

దర్శకుడు ఒమన్గ్ కుమార్ ప్రస్తుత ప్రధాని మోడీ జీవితంపై బయోపిక్ తీసే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథను సిద్ధం చేసిన ఆయన మోడీ పాత్రధారి కోసం కొన్నాళ్లుగా కసరత్తు చేసి బాలీవుడ్‌ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను చూజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి నుండి మొదలుకానున్న ఈ సినిమాలో మోడీ ప్రధానిగా ఎలా ఎదిగారనే విషయాల్ని చూపుతారట. ఇకపోతే వివేక్ ఒబెరాయ్ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం జనవరి 11న విడుదలకానుంది.