డ్రగ్స్ కేసులో నిర్మాత కుమారుడు!

హైదరాబాద్ లో మత్తుపదార్ధాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ బారిన పడ్డవారు ఉన్నారని తెలియగానే ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇకనైనా మత్తుపదార్ధాలను వదిలి పెట్టాలని లేదంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కు అలవాటు పద్దవారు ఎవరా..? అనే ఆసక్తి మొదలైంది. ప్రముఖ నిర్మాత కొడుకు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని తెలుస్తోంది. ఇటీవల భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. సినిమాల పరంగా కెరీర్ బావున్నప్పటికీ ఈ డ్రగ్స్ ను మాత్రం విడిచిపెట్టలేకబోతున్నాడట.
ఇక ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంటోన్న యంగ్ హీరోపై ఈ ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. అలానే సీనియర్ నటుడు కొడుకు యాక్టర్ కమ్ డైరెక్టర్ ఒకరు కూడా ఈ డ్రగ్స్ కు బానిసగా మారారని సమాచారం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తన సినిమాలతో ప్రత్యేకత చాటాలని పరితపించే ఈ డైరెక్టర్ చాలా కాలంగా ఓ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు కానీ అది నానుస్తూనే ఉన్నాడు. ఇటీవల తన తండ్రిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని కాస్త ఘాటుగానే స్పందించాడు. అయితే వీరందరికీ డ్రగ్స్ సప్లయి చేసేది ప్రముఖ హీరోల కార్ డ్రైవర్లు అని సమాచారం. ఇకనైనా వీరు డ్రగ్స్ కు దూరంగా ఉంటే మంచిది. లేకపోతే వారిపై చర్యలు తీసుకోవడం తప్పదు.