రానా కోసం బిగ్ స్టార్స్!

యుద్ధం, జలాంతర్గామి నేపధ్యంలో నడిచే ‘ఘాజీ’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు రానా. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు ఈ హీరో. దానికి తగ్గట్లుగానే సినిమా ట్రైలర్ విడుదలయ్యి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషల్లో వచ్చే నెల 17న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను లింక్ చేస్తూ వాయిస్ ఓవర్ ఉంటుందట. సినిమా టీజర్ చూసి ఇంప్రెస్ అయిన అమితాబ్ హిందీలో వాయిస్ ఓవర్ తనే ఇస్తానని చెప్పడం విశేషం.

ఇక తెలుగులో మన మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడం.. రానా పట్ల అతని అభిమానాన్ని తెలియజేస్తుంది. అలానే తమిళంలో సూర్య వాయిస్ అందించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సినిమాకు వీరి వాయిస్ ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. మరి సినిమా విడుదలైన తరువాత ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో.. చూడాలి!