Bigg Boss 8 Telugu Elimination:
గతవారం అంటే Bigg Boss 8 Telugu మొదటివారం బెజవాడ బేబక్క అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక ఈసారి ఎవరు ఇంటి నుండి వెళ్లబోతున్నారు అని.. ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ లైన్ లను బట్టి చూస్తే.. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎవరు ఎలిమినేట్ అవుతారు అని హింట్ వచ్చేసింది. రేపటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక ఒక్క రోజులో ఓట్లు పెరిగిపోవడం అంత త్వరగా జరిగే పని కాదు. కాబట్టి ఈసారి ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే అని చెప్పుకోవచ్చు.
నిజానికి మొదటి రోజు శేఖర్ భాషా కి ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. కానీ అతని టీం బాగానే బజ్ పెంచి ఓట్లు పడేలాగా చేసింది. మరోవైపు విష్ణు ప్రియ విషయంలో కూడా సింపతి చాలా బాగా వర్క్ ఔట్ అయింది. సోనియా విష్ణు ప్రియ మీద పర్సనల్ విషయాలపై ఎటాక్ చేయడం మీద.. చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ రకంగా ఆల్రెడీ మంచి ఫాలోయింగ్ ఉన్న విష్ణు ప్రియ కి ఓట్లు కూడా ఇంకా ఎక్కువ అయ్యాయి.
ఇక ఈవారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే కంటెస్టెంట్ సీత అని తెలుస్తోంది. అయితే మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే.. ముఖ్యంగా పృథ్వీరాజ్ కంటే ఈ వారం సీతా పర్ఫామెన్స్ ఎక్కువగానే ఉంది. ఆమె గొంతు కూడా ఇంట్లో బాగానే వినిపిస్తోంది. కానీ ఎందుకు ఆమె ఎలిమినేట్ అవ్వబోతోంది అంటే.. దానికి కారణం పి.ఆర్ టీం సరిగ్గా లేకపోవడం అని చెప్పుకోవచ్చు.
Read More: Bigg Boss 8 Telugu ఇంటి నుండి ఆమెను అందుకే ఎలిమినేట్ చేసేశారా?
మంచి పీ ఆర్ టీం లేకపోవడం వల్ల చాలామంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మంచి పీ ఆర్ టీం ఉండటం కారణంగా కౌశల్ మండ, పల్లవి ప్రశాంత్ వంటి వారు చాలా సులువుగా షో విన్నర్లు అయిపోయారు. కాబట్టి షోలో నెట్టుకు రావడం కోసం పి ఆర్ టీం కూడా ముఖ్యమే. అది సరిగ్గా లేని సీత ఈ వారం ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.