సినిమాటికెట్ల రేట్లపెంపుపై కోర్టులో పిటిషన్‌వేస్తాం

సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అనుమతివ్వలేదని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి మేరకు నిన్న థియేటర్ల యజమాన్యాలే టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికొచ్చిందన్న తలసాని.. సినిమా టికెట్ల ధరల పెంపుపై కోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. ఈ అంశంపై హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ, అధికారులతో చర్చించినట్లు చెప్పారు. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సామాన్యులు కూడా సినిమా చూడాలంటే టికెట్ల రేట్లు తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు.

సినిమా టికెట్ల ధరలు ఎలా ఉండాలన్న అంశంపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, కమిటీ నివేదిక ఆమోదం కోసం కేబినెట్‌కు పంపిన సమయంలో సాధారణ ఎన్నికలురావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రి వివరించారు.

CLICK HERE!! For the aha Latest Updates