
Suhana Khan expensive watch:
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ తాజాగా తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో జరిగిన ఇబ్రహీం అలీ ఖాన్ తొలి సినిమా ‘నాదానియాన్’ ప్రీమియర్ ఈవెంట్‌కి హాజరైన సుహానా తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ వేడుకలో సుహానా ఖాన్ స్టైలిష్ బ్లాక్ మిడీ డ్రస్‌లో మెరిసిపోగా, ఆమె ధరించిన ఖరీదైన వాచ్ అందరి చూపును తిప్పుకునేలా చేసింది. సుహానా Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon మోడల్ వాచ్ ధరించగా, దీని ఖరీదు రూ. 1.21 కోట్ల నుండి రూ. 1.43 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. రోస్ గోల్డ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన ఈ వాచ్‌కు స్టైలిష్ ఆలిగేటర్ లెదర్ స్ట్రాప్ ఉంది.
సుహానా తన లుక్‌ను మరింత మెరుగుపరిచేందుకు బ్లాక్ లెదర్ బెల్ట్, గోల్డ్ జువెలరీ, క్లాసిక్ పీప్-టో హీల్స్‌ను ఎంచుకుంది. అంతేకాకుండా, ఆమె చేతిలో ఉన్న హర్మెస్ మినీ కెల్లి బ్యాగ్ ధర సుమారు రూ. 22 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
సుహానా ఖాన్ ఫ్యాషన్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, తండ్రి షారుక్ ఖాన్ తరహాలో లగ్జరీ స్టైల్ ఐకాన్‌గా ఎదుగుతోంది.













