HomeTelugu Trendingజీఎస్టీ సోదాలపై సుమ, అనసూయ స్పందన..

జీఎస్టీ సోదాలపై సుమ, అనసూయ స్పందన..

1 23
ప్రముఖ టీవీ యాంకర్‌ సుమ.. తన నివాసంలో జీఎస్టీ సోదాలు జరిగాయని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. సుమ కనకాల జీఎస్టీ సరిగ్గా కట్టలేదని, అందుకనే ఆమె నివాసంలో సోదాలు జరిగాయని గత కొన్నిరోజుల నుంచి కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు సుమ ట్విటర్‌ వేదికగా ఆ వార్తలను ఖండించారు. సోదాల గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమైనవని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘నా నివాసంలో జీఎస్టీ సోదాలు జరిగాయని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎక్కడ? ఏ నివాసంలో? అవి జరిగాయో చెప్పండి. క్రమం తప్పకుండా నేను జీఎస్టీ పన్నులను చెల్లిస్తున్నాను. దీనికి సంబంధించిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఇలాంటి చెత్త వార్తలను ప్రచురించే ముందు ఆయా ఛానళ్లు, పత్రికల వారు పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి’ అని సుమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు అనసూయ సైతం తన నివాసంలో సోదాలు జరిగాయంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘బంజారాహిల్స్‌లోని నా నివాసంలో సోదాలు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజం కాదు. మీడియా ఉండేది సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేయడానికే తప్ప తమ వ్యక్తిగత అభిప్రాయాలను అందించడానికి కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉన్న మేము ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశాం. మీడియా అనేది సమాజానికి మంచి చేయడానికి పనిచేయాలి. అంతేకాని ఒకరి వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించకూడదు. సరైన సమాచారాన్ని తెలుసుకున్నాకే ప్రజలకు వార్తలను అందించాలని మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని అనసూయ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!