కేసీఆర్‌ ఆదేశిస్తే పోటీకి దిగుతా: సుమన్‌

గుంటూరు జిల్లా రేపల్లె నుంచి టీడీపీ తరఫున తాను పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ఆయన.. తన దృష్టంతా తెలంగాణపైనే కేంద్రీకరించానని సినీ నటుడు సుమన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లా ప్రశ్నించేవాళ్లు రాజకీయాల్లో ఉండాలని సుమన్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశిస్తే తాను వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో సినిమా పరిశ్రమ నుంచి..’జై తెలంగాణ’ నినాదం చేసి మొదటి వ్యక్తిని తానేనని గుర్తుచేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య బీసీల కోసం పార్టీ పెడితే ఆయనకూ మద్దతిస్తానని సుమన్‌ ప్రకటించారు. ఏపీ అభివృద్ధి ఆగిపోవద్దంటే చంద్రబాబుకే మరోసారి అవకాశమివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.