సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రముఖ్యత ఇస్తారో తెలిసిందే. షూటింగ్‌లకు గ్యాప్ వస్తే.. ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు వెళ్తుంటారు. ఫ్యామిలీతో గడపడం మహేశ్‌కు సరదా అనే విషయం తెలిసిందే. ఇక సితారా, గౌతమ్‌లు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వీరు చేసే అల్లరిని మహేశ్ సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా మహేశ్, గౌతమ్, సితారా ఫోటోను షేర్‌చేస్తూ.. ఒకరిపై ఒకరు పడుకున్నారు.. లంచ్ టైమ్ ఇంట్లోనో గడిపాము అంటూ.. తెలిపారు. లంచ్‌టైమ్‌లో తనకిష్టమైన ఫుడ్ చేయలేదోమో.. సితారా అలిగితే.. మహేశ్ వచ్చి ఓదార్చుతున్నట్లు..గౌతమ్ వచ్చి వీరి మీది పడి నవ్వుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
View this post on InstagramFalling on each other 😍😍lunch break spent at home 💕💕#cantgetenough 💖💖
A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on