‘ఇదమ్ జగత్’ ట్రైలర్‌

సుమంత్ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ఇదమ్ జగత్’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు క్యూరియాసిటీని పెంచింది. హాలీవుడ్ సినిమా రేంజులో ఉత్కంఠతను కలిగించారు. ఇందులో సుమంత్ రిపోర్టర్ గా కనిపిస్తాడు.

అందరిలా కాకుండా రాత్రిపూట సిటీలో తిరుగుతూ నేరాలను కవర్ చేస్తుంటాడు. న్యూస్ అంటే క్రైమ్, యాక్సిడెంట్, మర్డర్ అని చెప్తూ.. సినిమా దేని చుట్టూ తిరగబోతుందో హింట్ ఇస్తూనే.. అందులో ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తప్పకుండా తెలుసుకుంటా అని చెప్పి ట్విస్ట్ ను కలిగించాడు. చివర్లో నాలాంటి వాడు ఒక్కడే ఉండాలి. ఒక్కడినే ఉంటా అని చెప్తూ మరింత ఉత్కంఠను కలిగించాడు.

మళ్ళిరావా సినిమాతో దారిలోకి వచ్చిన సుమంత్, సుబ్రహ్మణ్యపురం సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదం జగత్ పేరుతో థ్రిల్లింగ్ సినిమా చేస్తున్నాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్ థీమ్ ఆకట్టుకోవడంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది.