HomeTelugu Trendingసందీప్‌ కిషన్‌ 'ఏ.1 ఎక్స్‌ప్రెస్' ఫస్ట్‌లుక్‌

సందీప్‌ కిషన్‌ ‘ఏ.1 ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్‌లుక్‌

Sundeep Kishan A1
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ‘ఏ.1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది. విజ‌యం సాధించిన సంతోషంలో తన చొక్కా తీసి హాకీ స్టేడియంలో విజయ సంకేతాన్ని చూపుతున్న‌ట్టుగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu