గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రిటీగా సన్నీలియోన్..!

అడల్ట్ సినిమాల నుంచి బాలీవుడ్ లోకి వచ్చిన తరువాత బాగా పాపులర్ అయింది. బాలీవుడ్ లో స్టార్స్ తో పోటీపడి నటిస్తూ.. దర్శక నిర్మాతలకు మంచి వసూళ్లు తెచ్చిపెడుతున్న సన్నీలియోన్, గూగుల్ లిస్ట్ లో మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది. గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రిటీ 2018 గా నిలిచింది.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ప్రధాని మోడీలను వెనక్కినెట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది సన్నీ. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లేదంటే టాలీవుడ్ సినిమాల గురించి ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేస్తుంటారు. ఈ ఏడాది మాత్రం విచిత్రంగా ఈ రెండింటిని పక్కన పెట్టి భోజ్ పురి సినిమాలకోసం ఎక్కువ మంది సెర్చ్ చేసినట్టు గూగుల్ ఇండియా పేర్కొంది.