త్రో బ్యాక్ పిక్‌తో మహేష్ బాబు భార్య నమ్రత.. ఫొటో వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. నమ్రత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత..90లో తన ఫ్రెండ్ స్వెట్లానా క్యాప్పర్‌తో దిగిన పాత ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమా తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా స్వస్తీ చెప్పిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates