HomeTelugu Trendingఅభిరామ్‌ ఎంట్రీపై సురేష్‌బాబు స్పందన

అభిరామ్‌ ఎంట్రీపై సురేష్‌బాబు స్పందన

3 9
దగ్గుబాటి వారసుడు అభిరామ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయన ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందా అనే ఆసక్తి దగ్గుబాటి అభిమానులలో వుంది. ఈ నేపథ్యంలోనే ‘అసురన్’ రీమేక్ లో ఆయన కనిపించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేష్‌ హీరోగా ‘అసురన్’ రీమేక్ ను రూపొందించడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో వెంకటేష్‌ చిన్న కొడుకుగా అభిరామ్ పరిచయం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేసే ఉద్దేశం లేదనీ, సోలో హీరోగానే అభిరామ్ ను పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని అన్నారు. మొత్తానికి అభిరామ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న మాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu