HomeTelugu News'అచలుడు' ఫస్ట్‌లుక్‌

‘అచలుడు’ ఫస్ట్‌లుక్‌

Suriya 41 movie title and f

తమిళ స్టార్‌ హీరో సూర్య.. డైరెక్టర్‌ బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌. 2డి ప్రొడక్షన్‌లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ను డైరెక్టర్ బాల పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ విడుదల చేశారు.

సోమవారం(జూలై 11న) దర్శకుడు బాల బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను వణంగన్‌(తెలుగలో అచలుడు)గా ఫిక్స్‌ చేశారు. ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సూర్య చిరిగిన‌ గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య- డైరెక్టర్ బాలా క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu