చరణ్ స్టైలిస్ట్ ఎవరో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి బుల్లోడుగా కనిపించనున్నాడు. అందువలన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతి విషయంలోనూ చరణ్ శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే తన స్టైలింగ్ బాధ్యతలను చూసుకోవడానికి ఆయన
తన సోదరి సుస్మితను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరుకి స్టైలింగ్ చేసిన సుష్మితకు మంచి పేరు వచ్చింది. చిరు యంగ్ లుక్ లో కనిపించడం వెనుక సుష్మిత రోల్ కూడా ఉందనే విషయం తెల్సిందే. మెగా ఫ్యాన్స్ కూడా సుష్మితను తెగ పొగిడేశారు. దీంతో ఈసారి కూడా తన స్టైలింగ్ బాధ్యతలు సుష్మితకు అప్పగించడానికి చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడు. తండ్రికి స్టైలింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న సుష్మిత మరి తమ్ముడుని ఎలాంటి లుక్ లో  చూపించబోతుందో!