‘సైరా’ మేకింగ్‌ వీడియో రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మొదలయ్యాయి. అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. మరలా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంతో పడిపోయారు. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల అవుతుందా కాదా అనే సందిగ్ధంలో పడ్డారు అభిమానులు. ఎట్టకేలకు సైరాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

సైరా మేకింగ్ వీడియో రిలీజ్ డేట్, టైమ్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సైరా నుంచి అధికారికంగా పోస్టర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. రేపు సాయంత్రం 3:45 గంటలకు సైరా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో మెగాస్టార్ ఆయుధాలు పట్టుకొని సీరియస్ గా నడుచుకుంటూ వస్తున్న దృశ్యం ఉన్నది. మేకింగ్ వీడియో రిలీజ్ కు సమయం తక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.