తాప్సీ అనుకున్నది సాదిస్తుందా..?

టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సొట్టబుగ్గల తాప్సీకు పెద్దగా కలిసి రాలేదు. తమిళ సినిమాల పరిస్థితి కూడా అలానే ఉండడంతో బాలీవుడ్ లో అయినా.. బిజీ హీరోయిన్ గా మారాలని అక్కడ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తాప్సీకు బాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. గతేడాది ఆమె నటించిన ‘పింక్’ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

హిందీలో ఆమె చేసిన ‘రన్నింగ్ షాదీ.కామ్’ ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అదే నెల 17న తెలుగు, హిందీ బాషల్లో ‘ఘాజీ’ సినిమా విడుదల కానుంది. ఇక మార్చిలో ‘నామ్ షబానా’ రిలీజ్ కానుంది. ఇలా తన సినిమాలు వెంటవెంటనే విడుదలవుతుండడంతో అమ్మడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు గనుక హిట్ అయితే తన క్రేజ్ మారిపోతుందనే నమ్మకంతో తాప్సీ ఉంది. మరి అనుకున్నట్లుగా హిట్స్ సంపాదిస్తుందో.. లేదో.. చూడాలి!