అనన్యగా తాప్సీ!

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, ‘పింక్’ మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది. తాప్సీ నటించిన తాజా చిత్రం ‘ఘాజి’. ఈ చిత్రంలో రెఫ్యూజీగా ‘అనన్య’గా తాప్సీ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందని ‘ఘాజి’ చిత్ర బృందం చెబుతోంది. ఈనెల 17న విడుదలకానున్న ‘ఘాజి’ కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన టీజర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా.. సదరు టీజర్ కు మెగాస్టార్ చిరంజీవిగారు చెప్పిన వాయిస్ ఓవర్ కు చాలా మంచి రెస్పాన్స్ లభిస్తోందని, ఇదే తరహా రెస్పాన్స్ థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి!