‘టాక్సీవాలా’ ట్రైలర్‌

విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం నవంబర్‌ 17న విడుదల కాబోతోంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హారర్‌, కామెడీ, యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్‌ మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఆ టాక్సీతో విజయ్‌ జీవితంలో వచ్చిన యూ టర్న్స్‌ని సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక లుక్స్‌తో అదరగొట్టేసింది. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కె‌ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించాడు.