HomeTelugu Trending'టెడ్డి' ట్రైలర్‌

‘టెడ్డి’ ట్రైలర్‌

Teddy Telugu Trailer

తమిళ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన తాజా కోలీవుడ్‌ చిత్రం ‘టెడ్డి’. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆర్య నటన ఆకట్టుకునేలా ఉంది. ‘కోమా స్టేజ్‌లో లైఫ్‌కి డెత్‌కి మధ్య ఉండే కొంతమంది తమ శరీరంలో నుంచి బయటకు వచ్చి తమని తాము చూసుకోగలుగుతారు.’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. మెడికల్ మాఫియా, స్టైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యకు జోడీగా ఆయన సతీమణి సాయేషా సందడి చేశారు. శక్తి సుందర్‌రాజన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu