అవమానంతో మొహం చాటేసిన స్టార్‌ హీరో.. ఈ హీరోకి గుండు కొట్టించింది ఎవరు?

బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘నమస్తే ఇంగ్లాండ్’ భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత చారిత్రాత్మకమైన సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు అర్జున్‌. లగాన్ వంటి ఇండియన్ ప్రౌడ్ సినిమాను తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో పానిపట్ సినిమాలో అర్జున్ నటిస్తున్నారు. 1761 వ సంవత్సరంలో జరిగిన మూడో పానిపట్టు యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నది.

మరాఠా యోధులకు – ఆఫ్ఘన్ రాజులకు మధ్య జరిగే యుద్ధం అది. ఇందులో అర్జున్ కపూర్ పేష్వా యోధుడిగా కనిపించబోతున్నారు. పేష్వా వంశాచార ప్రకారం యోధులు గుండుతో ఉంటారు. దీంతో అర్జున్ కపూర్ ఈ సినిమాలో గుండుతో కనిపించబోతున్నారు. దానికి సంబంధించిన ట్రైలర్ షూట్ కోసం అర్జున్ కపూర్ గుండు చేయించుకొని అశుతోష్ గోవారికర్ ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడి నుంచి బయటకు వచ్చే సమయంలో క్యాప్ పెట్టుకొని ముఖం కనిపించకుండా ముసుగు వేసుకొని బయటకు వెళిపోయాడు. అర్జున్ కపూర్ ముసుగు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.