HomeTelugu Trending'కిరాతక' టైటిల్‌తో రానున్న ఆది సాయికుమార్‌

‘కిరాతక’ టైటిల్‌తో రానున్న ఆది సాయికుమార్‌

Aadi saikumar new movie tit

ఆది సాయికుమార్ హీరోగా ప్ర‌ముఖ డైరెక్షన్‌ ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘కిరాత‌క‌’ అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ.. ‘ఆది కుమార్ హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. మరోసారి మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యింది. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా సినిమాకి ప్ల‌స్ అవుతాయి’ అన్నారు. చిత్ర‌ నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీర‌భ‌ద్రం గారి కాంబినేష‌న్‌లో `కిరాత‌క‌`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నాం’ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu