రికార్డుల రారాజు హరీశ్‌రావు

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీజేఎస్‌ అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై 92,909 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. 2004 ఉపఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన హరీశ్‌రావు తర్వాత వరుస విజయాలు సాధిస్తున్నారు. 2008, 2010 ఉపఎన్నికలతోపాటు 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించినట్లైంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా అధికార టీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది.