HomeTelugu Trendingసినిమాలు మహిళల గౌరవం పెంచేలా ఉండాలి: హరీశ్‌రావు

సినిమాలు మహిళల గౌరవం పెంచేలా ఉండాలి: హరీశ్‌రావు

18
సినిమాలు సమాజంలో మనిషి బాధ్యత, విలువలు తెలియజేసేలా సందేశాత్మకంగా ఉండాలి, మహిళల గౌరవం పెంచేలా ఉండాలి.. అప్పుడే సినిమా సొసైటీతో మ్యాచ్ అవుతుందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉదయ్‌శంకర్‌, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటించిన మిస్ మ్యాచ్ చిత్రం ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ప్రముఖ నటుడు వెంకటేశ్‌, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నటుడు శ్రీవిష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన దిశకు సంఘీభావంగా వేదికపై అతిథులు, చిత్రబృందం మౌనం పాటించారు.

”ఇప్పుడు సినిమా రంగంలో కొత్త తరం హవా నడుస్తోందని హరీశ్‌రావు అన్నారు. కొత్త కథలతో.. కొత్త ఆలోచనలతో నూతన దర్శకులు, నటీనటులు వస్తున్నారని..అద్భుత విజయాలు అందుకుంటున్నారని అన్నారు. అలాగే ‘మిస్‌ మ్యాచ్‌’ కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీడల అంశం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. ఓ యువకుడు తన ప్రేమికురాలి విజయం కోసం పడిన తపనను చూపించే చక్కటి సందేశాత్మక చిత్రం అన్నారు. ప్రేమ అనేది మనిషి సామర్ధ్యం పెంచాలి. ఒక విజయం వైపు నడిపించాలి. పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండాలి అన్నారు. ఉదయ్ రెండో సినిమానే అయినా చక్కగా నటించారని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu