Homeతెలుగు Newsదేశ రక్షణలో తెలుగు సంస్థ.. కీలక ప్రాజెక్టు సొంతం

దేశ రక్షణలో తెలుగు సంస్థ.. కీలక ప్రాజెక్టు సొంతం

బల్లపరుపుగా.. చదునుగా మైదానాలుగా ఉండే ప్రాంతాల్లో రోడ్డు వేయాలంటే మనమైనా వేస్తాం.. కానీ కిలోమీటర్ల ఎత్తు ఉండే హిమాలయ కొండలపై.. ఎప్పుడూ వచ్చే మంచు తుఫానులను తట్టుకొని.. ఓవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు.. మరోవైపు చైనా సైనికులు.. మధ్యలో నదిని చీల్చుకుంటూ చావుతో పోరాడుతూ రోడ్డు వేయాలి.. వేసే దమ్ముందా అంటే.. ఉంది అంటూ ముందుకొచ్చింది.. అది మన తెలుగు సంస్థే కావడం మనకు గర్వకారణం.. 8నెలలు పాటు మంచుతో కప్పబడే ప్రాంతం. కశ్మీర్ రాష్ట్రంలోని లఢక్ సరిహద్దుల్లో బతకడమే కష్టం. అలాంటి క్లిష్టమైన చోట రహదారి కం టన్నెల్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకొని తెలుగు వారి సంస్థ మేఘా దేశ రక్షణలో తనదైన ముద్ర వేయానికి రెడీ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మౌలిక వసతుల రంగంలో నిరూపించుకున్న మేఘా సంస్థ ఇప్పుడు చైనా సరిహద్దులకు వేగంగా చేరుకునే క్లిష్మైన రహదారిని నిర్మించే గొప్ప పనికి సంకల్పించింది.

MEIL to construct Zojilla Tunnel 2

కశ్మీర్ నుంచి లఢక్ కు వెళ్లే రహదారి భారతదేశ రక్షణపరంగా అత్యంత ప్రాధాన్యమైంది. ఆ రహదారి ప్రతీ శీతాకాలంలోనూ 8 నెలలు మూసివేస్తారు. అప్పుడే మనదేశంపైకి ఉగ్రవాదులు సహా చైనా, పాకిస్తాన్ సైన్యాలు చొరబడుతున్నాయి. అందుకే దేశంలోనే అత్యంత క్లిష్టమైన కాశ్మీర్ – లడఖ్ లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన రహదారి టన్నెల్ పనులకు టెండర్ ను పిలవగా.. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రపంచప్రఖ్యాత మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థ (ఎంఈఐఎల్) ఈ టెండర్ దక్కించుకుంది. దేశ రక్షణలో తాను సైతం అని ముందుకొచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు పోటీపడ్డ ఈ కాంట్రాక్టును మేఘా దక్కించుకోవడం విశేషం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్ము కాశ్మీర్ – లడఖ్ లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్ లో మేఘా సంస్థ ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలవడం విశేషం.. శుక్రవారం జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ ఐ డి సి ఎల్ (ఎన్.హెచ్.ఐ.డీ.సీ.ఎల్) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది.

MEIL to construct Zojilla Tunnel

దేశ రక్షణలో కీలకమైన ప్రాజెక్ట్ ఇదీ..

జమ్ము కాశ్మీర్ – లడఖ్ లోని జోజిల్లా పాస్ టన్నెల్ పని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా నిర్మించాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. ఇందులో రెండు టన్నెల్స్ ఉన్నాయి. మొదటిది 2 కి.మీ. మరియు రెండవది 0.5 కి.మీ. అలాగే రెండో విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో శీతల వాతావరణం.. ఉగ్రవాద ముప్పు ఉండే పరిస్థితుల్లో అత్యంత రక్షణాత్మకంగా ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ రోడ్ టన్నెల్ కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారిని నిర్మించేందుకు మరియు ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. గత నెల 30వ తేదిన కేంద్రం మూడు సంస్థలు బిడ్ లు సమర్పించగా ఆగష్టు 21 న ఫైనాన్స్ బిడ్లు తెరిచారు.

MEIL to construct Zojilla Tunnel 3

దేశ రక్షణలో కీలకమైన రహదారి ఇదీ..

జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెలలపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రస్తుతం లఢక్ సరిహద్దుల్లో చైనా మోహరించిన నేపథ్యంలో అక్కడికి మన సైన్యాన్ని తీసుకోవడం శీతాకాలంలో చాలా కష్టం. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. ఈపిసి పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్ ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండప్రాంతంతో పాటు మంచు తుఫాన్ లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సరిహద్దు రహదారులు సంస్థ జమ్ము కాశ్మీర్- లడఖ్ మధ్య అన్ని వర్గాల వారికి రహదారి ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైవే టన్నెల్ ను శ్రీనగర్ నుంచి బల్తల్ వరకు కూడా నిర్మించాలి. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు.

MEIL to construct Zojilla Tunnel 1

క్లిష్టమైన దేశ రక్షణ ప్రాజెక్టులో మేఘా భాగస్వామ్యం..

దేశ రక్షణ పరంగా అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును మేఘా దక్కించుకోవడం విశేషంగా మారింది. సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించేలా రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్. సుబ్బయ్య తెలిపారు. ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పనులన్నీ మొత్తం 18.475 కిలోమీటర్లు. అదే విధంగా పార్ట్-2లోని జోజిల్లా టన్నెల్ నిర్మించాలి. ఎక్కడా లేనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకావచ్చని ఆయన అన్నారు. ఇందులో ప్రత్యేకంగా ట్రాన్స్ పోర్టు వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వీటికి అధనంగా రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని సుబ్బయ్య తెలిపారు. మంచుతుఫాన్ లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu