అలాంటి వారిని నరికిపారేయాలి.. ట్విట్టర్‌లో రష్మి ఫైర్‌

అత్యాచారాలకు ఒడిగడుతున్న నరరూప రాక్షసులపై యాంకర్‌, సినీ నటి రష్మి గౌతమ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించగా, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా రష్మి మండిపడ్డారు.

‘రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని భావిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికిపారేయాలి. లేకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి స్త్రీ జాతి విలువ తెలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates