HomeTelugu Newsఉగ్రవాదుల దాడిలో 42కి పెరిగిన మృతుల సంఖ్య

ఉగ్రవాదుల దాడిలో 42కి పెరిగిన మృతుల సంఖ్య

10 9
జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన దాడిలో మరణించిన జవాన్ల సంఖ్య 42కి చేరింది. అవంతీపురాలో జైషె మొహమ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్లను టార్గెట్ చేసి వాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి చేశాడు. ఈ దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రవాద దాడి కోసం అతను 350 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో బస్సుని ఢీ కొట్టాడు. దీంతో బస్సు తునాతునకలైంది. దాదాపుగా 5 కి.మీల దూరానికి పేలుడు శబ్దం వినిపించింది.

సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ని శ్రీనగర్ నుంచి పుల్వామా తీసుకెళ్తుండగా ఆ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. పేలుడు జరపగానే ఉగ్రవాదులు ఫైరింగ్ ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లో అప్పుడు 2,500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన బస్సు 76వ బెటాలియన్ కి చెందినదని, అప్పుడు అందులో 42 మంది జవాన్లు ఉన్నట్టు సీఆర్పీఎఫ్ ప్రకటించింది.

1.జైమాల్ సింగ్-76వ బెటాలియన్
2.నసీర్ అహ్మద్-76వ బెటాలియన్
3.సుఖ్వీందర్ సింగ్-76వ బెటాలియన్
4.రోహితాష్ లాంబా-76వ బెటాలియన్
5.తికల్ రాజ్-76వ బెటాలియన్
6.భాగీరథ్ సింగ్-45వ బెటాలియన్
7.బీరేంద్ర సింగ్-45వ బెటాలియన్
8.అవధేష్ కుమార్ యాదవ్-45వ బెటాలియన్
9.నితిన్ సింగ్ రాథోడ్-3వ బెటాలియన్
10.రతన్ కుమార్ ఠాకూర్-45వ బెటాలియన్
11.సురేంద్ర యాదవ్-45వ బెటాలియన్
12.సంజయ్ కుమార్ సింగ్-176వ బెటాలియన్
13.రామ్ వకీల్-176వ బెటాలియన్
14.ధరమ్ చంద్ర-176వ బెటాలియన్
15.బేల్కర్ ఠాకా-176వ బెటాలియన్
16.శ్యామ్ బాబు-115 బెటాలియన్
17.అజిత్ కుమార్ ఆజాద్-115వ బెటాలియన్
18.ప్రదీప్ సింగ్-115వ బెటాలియన్
19.సంజయ్ రాజ్ పుత్-115వ బెటాలియన్
20.కౌశల్ కుమార్ రావత్-115వ బెటాలియన్
21.జీత్ రామ్-92వ బెటాలియన్
22.అమిత్ కుమార్-92వ బెటాలియన్
23.విజయ్ కుమార్ మౌర్య-92వ బెటాలియన్
24.కుల్వీందర్ సింగ్-92వ బెటాలియన్
25.విజయ్ సోరంగ్-82వ బెటాలియన్
26.వసంత్ కుమార్ వీవీ-82వ బెటాలియన్
27.గురు హెచ్-82వ బెటాలియన్
28.శుభమ్ అనిరంగ్ జీ-82వ బెటాలియన్
29.అమర్ కుమార్-75వ బెటాలియన్
30.అజయ్ కుమార్-75వ బెటాలియన్
31.మనీందర్ సింగ్-75వ బెటాలియన్
32.రమేష్ యాదవ్-61వ బెటాలియన్
33.పర్శానా కుమార్ సాహూ-61వ బెటాలియన్
34.హేమ్ రాజ్ మీనా-61వ బెటాలియన్
35.బబ్లా శంత్రా-35వ బెటాలియన్
36.అశ్వనీ కుమార్ కోచీ-35వ బెటాలియన్
37.ప్రదీప్ కుమార్-21వ బెటాలియన్
38.సుధీర్ కుమార్ బన్సల్-21వ బెటాలియన్
39.రవీందర్ సింగ్-98వ బెటాలియన్
40.ఎం బాసుమాతారే-98వ బెటాలియన్
41.మహేష్ కుమార్-118వ బెటాలియన్
42.ఎల్ఎల్ గుల్జార్-118వ బెటాలియన్

Recent Articles English

Gallery

Recent Articles Telugu