
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ బర్త్ డే (జూన్ 21) సందర్భంగా వదిలిన కొత్త సినిమా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా.. విజయ్ బర్త్ డే సందర్భంగా 65వ సినిమా అప్డేట్ వస్తుందని వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే తాజాగా దళపతి విజయ్ 65వ మూవీ అప్డేట్ వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. బీస్ట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్‌తో విజయ్ రచ్చ చేయనున్నారు. గన్ పట్టుకుని విలన్లను పరిగెత్తించేందుకు విజయ్ రెడీ అవుతున్నట్టున్నారు. అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
#Thalapathy65 is #BEAST@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja#BEASTFirstLook #Thalapathy65FirstLook pic.twitter.com/Wv7wDq06rh
— Sun Pictures (@sunpictures) June 21, 2021













