
Thalapathy Vijay Blockbusters:
తలపతి విజయ్ పేరు వినగానే అభిమానులు ఎగిరిపడతారు. ఎందుకంటే ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2017లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్ సినిమా విజయ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన వరుసగా 8 సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. ఇది ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డ్.
విజయ్ నటించిన సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వరిసు, లియో, చివరగా వచ్చిన GOAT — అన్ని సినిమాలూ కనీసం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరినవే. ఇందులో లియో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.605 కోట్ల వసూళ్లు రాబట్టి రజినీకాంత్ ‘జైలర్’ను దాటి పోయింది. GOAT సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా అది రూ.400 కోట్ల మార్క్‌ను దాటేసింది.
View this post on Instagram
ఇలాంటి స్థిరమైన హిట్లు అందించిన హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో మిగతా వాళ్ల కంటే ఒక్క అడుగు ముందే ఉన్నాడు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌కు వరుసగా ఆరు రూ.200 కోట్ల సినిమాల రికార్డుంది. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మూడు సినిమాలతో హిట్స్ అందుకుంటున్నాడు. కానీ విజయ్ మాత్రం ఎనిమిది సినిమాలతో ఆ రికార్డును మించిపోయారు.
ఇప్పటికే తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా విజయ్ ప్రారంభించాడు. 2024 ఫిబ్రవరి 2న TVK అనే పార్టీని ప్రకటించి, సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు స్పష్టం చేశారు. చివరి సినిమా జననాయకన్, హి. వినోద్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో పూజా హెగ్డే, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. దీనితో విజయ్ 51ఏళ్ల వయసులో సినిమాలకు వీడ్కోలు చెబుతున్నారు.
ALSO READ: Hari Hara Veera Mallu ట్రైలర్ తెలుగు సినీ చరిత్రలో మొదటి అద్భుతం!