రాజమౌళికి ధన్యవాదాలు తెలిపిన ఆలియా భట్‌

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ అభిమానులకు ఈరోజు పండుగనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నారామె. అందులోనూ రామ్‌చరణ్‌కు జోడీగా..! ఈ సినిమాతోనే ఆలియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా తనకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఆలియా ట్విటర్‌ వేదికగా రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈరోజు నేను చాలా గొప్పగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ రాజమౌళి సర్‌..’ అని పేర్కొన్నారు. ఆలియా ట్వీట్‌కు రాజమౌళి సమాధానమిస్తూ.. ‘తోటి నటులతో పోటీపడటానికి అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా సినిమాలో నువ్వు అదే నిబద్ధతను చూపించబోతున్నందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆలియా భట్‌ను ఎంపికచేసుకున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆలియాకు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అందుకే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు ఒప్పుకోలేదని కూడా వదంతులు వినిపించాయి. కానీ ఈరోజు రాజమౌళి ప్రెస్‌మీట్‌లో అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ తీర్చేశారు.

ఆలియా ట్వీట్‌కు రాజమౌళి సమాధానమిస్తూ.. ‘తోటి నటులతో పోటీపడటానికి అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా సినిమాలో నువ్వు అదే నిబద్ధతను చూపించబోతున్నందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates