బాలయ్య కోసం రెడ్డిగారు, జయసింహ!

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా దాదాపు ఖరారపోయినట్లే తెలుస్తోంది. ఎంతమంది దర్శకులు బాలయ్య దగ్గరకు కథ పట్టుకొని తిరిగినా ఆయన ఓటు మాత్రం తమిళ నిర్మాత కె.ఎస్.రవికుమార్ కే దక్కింది. అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే రెండు టైటిల్స్ ను కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. అవే రెడ్డి గారు, జయసింహ. బాలయ్య కెరీర్ లో రెడ్డి, సింహా అనే పదాలు కీలకపాత్ర పోషించాయి.
 
సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి ఇలా రెడ్డి పేర్లతో వచ్చిన సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో.. తెలిసిందే. ఇక సింహా సెంటిమెంట్ గురించి చెప్పనక్కర్లేదు. మొదటినుండి బాలయ్య చేసిన సినిమాలు లక్ష్మీనరసింహ, సింహా, నరసింహనాయుడు ఇలా ఆయన సింహా అనే పదం వాడిన ప్రతిసారి హిట్ కొడుతూనే ఉన్నాడు. మరి ఈసారి బాలయ్య ఏ టైటిల్ వైపు మొగ్గుచూపుతాడో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే..!