ఒకే డైలాగ్ తో ‘తొలిప్రేమ’ చూపించేశాడు!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వెంటనే క్రిష్ తెరకెక్కించిన ‘కంచె’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోకున్నా..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ తో మరో ఘన విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో  బి.వి.ఎస్‌.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మించిన  ‘తొలిప్రేమ’ చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. 

ఈ రోజు (బుధ‌వారం) ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేశారు. స‌ముద్ర తీరాన న‌డుచుకుంటూ.. వ‌రుణ్ త‌న‌లో త‌ను ‘మ‌న జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వ‌చ్చివెళ్లిపోయినా.. మ‌నం ఫ‌స్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేం’ అనుకునే డైలాగ్ బాగుంది. ఫిబ్ర‌వ‌రి 9న ఈ సినిమా తెర‌పైకి రానుంది. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.