సోను భాయ్‌‌.. నాకు కూడా హెల్ప్‌ చేయి: బ్రహ్మాజీ

సినీనటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటోన్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ ఆయనకు ప్రతిరోజు వేలాది మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. కష్టం అంటూ తన దృష్టికి వచ్చిన వారందరికి సాయం చేస్తున్నారు సోనూ సూద్‌. అయితే అప్పుడప్పుడు కొందరు తనని ఆటపట్టించడం కోసం వింత వింత కోరికలు కోరుతున్న సంఘటనలు కొన్ని చూశాం. తాజాగా అలాంటి ఫన్ని రిక్వెస్ట్‌ ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

తాజాగా.. సినీనటుడు బ్రహ్మాజీ సోనూసూద్‌కు ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘డియర్ సూపర్‌మ్యాన్‌ సోనూ భాయి.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. మానసికంగా లాక్‌డౌన్ అయ్యాను. హైదరాబాద్‌లో ఇరుక్కుపోయాను.. నన్ను ఈ ప్రాంతానికి తీసుకెళ్లు..’ అంటూ ఆయన ఓ బీచ్‌ ఫొటోను పోస్ట్ చేశాడు. ఎంతో విలాసవంతంగా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లాలని ఉందంటూ ఆయన సరదాగా చెప్పాడు. ఆయన చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తనపై ఓ నెటిజన్ వేసిన సెటైర్‌కు సంబంధించిన ఓ వీడియోను బ్రహ్మాజీ పోస్ట్ చేశాడు.

CLICK HERE!! For the aha Latest Updates