HomeTelugu Trendingనిర్మాతగా కృష్ణుడు

నిర్మాతగా కృష్ణుడు

Krishna as the producer
టాలీవుడ్‌లో ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ వంటి సినిమాల్లో హీరో గా నటించిన హీరో కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్య క్రియేషన్స్‌ అనే నిర్మాణ సంస్థను ఆయన స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత కృష్ణుడు మాట్లాడుతూ.. ‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదరించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’’ అని అన్నారు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా తెలుగు తెర‌కు పరిచయం చేస్తున్నారు కృష్ణుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!