
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అందరూ ఓకే ఫ్రేంలో దర్శనమిచ్చారు. ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పుట్టిన రోజు వేడుకల్లో సెలబ్రేషన్స్ ని వంశీ ఇండస్ట్రీ మిత్రులతో సహచరులతో కలిసి ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిరంజీవితో పాటుగా దర్శకులు బి. గోపాల్, కొరటాల శివ, పరశురామ్ పెట్లా, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేష్ హాజరయ్యారు. అంతేకాదు స్టార్స్ కీర్తి సురేష్, సంగీత, కార్తీ, అల్లు అరవింద్, సోనూసూద్, దిల్రాజు దంపతులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి టాలీవుడ్ డైరెక్టర్స్ అందరు కలిసి తీసుకున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ దర్శకులందరూ మెగాస్టార్ తో కలిసి ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో సినీ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.













