‘లూసిఫర్‌’ ఆ పాత్రలో త్రిష!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్‌లో బీజీగా ఉన్నారు. తరువాత మలయాళ సూపర్‌ హిట్‌మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ పాత్రలో సీనియర్ నటి సంతకం చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య మూవీలో లీడ్‌ రోల్‌ పోషించాల్సిన త్రిష అనూహ్యంగా వైదొలిగింది. మెగాస్టార్‌ సూపర్‌ హిట్‌ స్టాలిన్ సినిమాలో జోడీగా నటించిన త్రిష, కథ నచ్చడంతో లూసిఫర్‌లో నటించేందుకు సంతకం చేసిందట. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ మూవీ వచ్చే నెలలో సెట్స్‌ మీదికి రానుంది. అలాగే కీలకమై హీరో అనుచరుడి హీరో సత్యదేవ్ అలరించనున్నాడు. ఈ మూవీలో నయనతార నటించనుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చెల్లి పాత్రలు చేసేందుకు సిద్ధంగా లేని నయనతార కథ నచ్చినా లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పినట్టు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates