HomeTelugu Trendingబిగ్‌బాస్‌-7: ఫినాలేకి గెస్ట్‌గా టాలీవుడ్‌ స్టార్‌ హీరో‌!

బిగ్‌బాస్‌-7: ఫినాలేకి గెస్ట్‌గా టాలీవుడ్‌ స్టార్‌ హీరో‌!

Tollywood star hero as a gu
తెలుగు బిగ్‍బాస్ -7 చివరి దశకు చేరుకుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగనుంది. ప్రస్తుతం హౌస్‍లో ఫైనలిస్టులుగా ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అంబటి అర్జున్, ప్రియాంక చివరి వారంలో నిలిచారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలనుంది. ఈక్రమంలో స్టార్‌ మా ఫినాలేకి గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తుంది.

చాలా మంది సెలెబ్రెటీల పర్ఫార్మెన్స్‌లతో పాటు యంగ్ హీరోయిన్లతో డ్యాన్స్ పర్ఫార్మెన్సెన్స్ ఉంటాయని టాక్‌. దీంతో ఫినాలేకు గెస్ట్‌గా ఎవరూ వస్తారో అని ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది. అయితే ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మెయిన్ గెస్ట్‌గా రానున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ మా ఛానెల్ మహేశ్‍తో మాట్లాడిందని వినికిడి. బిగ్‍బాస్ 7వ సీజన్ విన్నర్‌ను మహేశ్ బాబు ప్రకటించనున్నారు.

Mahesh Babu's charming speech at 'SVP' event wins hearts - Tamil News -  IndiaGlitz.com

టీఆర్‌పీ రేటింగ్స్ పరంగా చూస్తే గత సీజన్ల కంటే ప్రస్తుతం 7వ సీజన్‍కే ఎక్కువగా వస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తే గ్రాండ్ ఫినాలే టీఆర్పీ మరింత భారీగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతే కాకుండా .. బిగ్‍బాస్‍లోనూ గుంటూరు కారం మూవీ ప్రమోషన్లను కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తారని తెలుస్తోంది. బిగ్‍బాస్ స్టేజీపైనే టీజర్ లాంచ్ కూడా ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu