ఆకట్టుకుంట్టున బన్నీ- అలియా ఫ్రూటీ యాడ్‌

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి కూల్ డ్రింక్ యాడ్‌ చేసింది ఈ బ్యూటీ. సమర్‌ కావడంతో కుల్‌డ్రింక్‌ కంపెనీలన్నీ, వేసవిలో చల్లచల్లటి యాడ్స్ తో వచ్చేస్తుంటాయి. ఫ్రూటీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆలియా అండ్ అల్లు అర్జున్ న్యూ యాడ్ సింపుల్ కాన్సెప్ట్ తోనే తీశారు. ఎడారిలో వెయిట్ చేస్తోన్న ఆలియా కోసం బన్నీ ‌ఫ్రూటీ తెప్పించి ఇవ్వటమే ప్రేక్షకులు చూడాల్సింది. అయితే, అందరికీ నచ్చుతున్నది మాత్రం… అలియా-బన్నీ కాంబినేషన్. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ తో కలసి కనిపించాల్సిన ఆలియా ఇలా హఠాత్తుగా స్టైలిష్‌ స్టార్ తో దర్శనం ఇవ్వటం నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ‘బన్నీ అండ్ బబ్లీ’ కాంబినేషన్ లో సినిమా కావాలని కామెంట్ చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates