మరో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ మొదలవుతుందా..?

సంక్రాంతి బరిలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు నిలిచి అభిమానులను సందడి చేశాయి. నిజానికి ఈ రెండు సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయి ఉంటే గనుక ఈ రేంజ్ హైప్ అయితే వచ్చి ఉండేది కాదు. రెండు సినిమాల రిలీజ్ ఒకేసారి ఉండడంతో అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన పబ్లిసిటీ క్రియేట్ అయ్యి రెండు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ కొట్టాయి. సినిమా లైఫ్ రెండు వారాలే కాబట్టి రిలీజ్ రోజు నుండి కలెక్షన్స్ భారీ రేంజ్ లో ఉండాలి.

కాబట్టి సినిమా క్రేజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవ్వాలి. అలాంటప్పుడు సోలో రిలీజ్ కంటే కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయితేనే సూపర్ బజ్ క్రియేట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల క్రేజ్ చూసి మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇలానే పోరుకి దిగుతారనే మాటలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ల సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. బాహుబలి సినిమాతో క్లాష్ కాకుండా ఓ డేట్ ప్లాన్ చేసుకొని రెండు సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్స్ మోత మోగడం ఖాయమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడానికి మరి ఇద్దరు హీరోలు అంగీకరిస్తారో.. లేదో.. చూడాలి!