HomeTelugu Big Storiesకౌశల్ ఆర్మీ విజయోత్సవ వేడుకలు, హీరో.. అంటూ నినాదాలు.. పక్కా..అంటున్న కౌశల్‌

కౌశల్ ఆర్మీ విజయోత్సవ వేడుకలు, హీరో.. అంటూ నినాదాలు.. పక్కా..అంటున్న కౌశల్‌

4

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-2 నిన్న ఆదివారంతో ముగిసింది. విన్నర్‌గా నిలిచిన కౌశల్…. టైటిల్‌తో బయకు వచ్చిన అనంతరం కౌశల్ ఆర్మీ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశల్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. అక్కడ హౌస్‌లో కష్టపడుతూ నా గేమ్ ఆడింది మిమ్మల్ని (అభిమాలను) సంపాదించుకోవడం కోసమే. ఇపుడు మీరు చెప్పండి నేను ఏమీచేయాలో అంటూ తన అభిమాలను ఉద్దేశించి కౌశల్ వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే ఫ్యాన్స్ అంతా… నువ్వు సినిమా హీరో కావాలంటూ నినాదాలు చేశారు. దీనికి కౌశల్ రియాక్ట్ అవుతూ తప్పకుండా మీ కోరిక తీరుస్తాను అంటూ మాట ఇచ్చారు.నేను హీరో అవ్వాలంటే డైరెక్టర్లు రావాలి, నేను వారి కోసం ఎదురు చూస్తున్నాను. నిజంగా కౌశల్ హీరోగా సినిమా తీస్తానని ఎవరైనా పెద్ద డైరెక్టర్ వస్తే నా తడాఖా అక్కడ కూడా చూపించేస్తాను. ఇన్ని రోజులు ఒక బ్రేక్ కోసం వెయిట్ చేశాను. బిగ్ బాస్-2 టైటిల్ విన్నర్ కావడం నా జీవితంలో ఓ బిగ్ బ్రేక్. ఈ బ్రేక్‌ను తప్పకుండా సద్వినియోగం చేసుకుని మీ అందరి సహకారంతో ఒక్కోక అడుగు ముందుకు వెళతాను… అని కౌశల్ వ్యాఖ్యానించారు.

4a

 

మీరు నాతో లైఫ్ లాంగ్ ఉండాలి. నాకు ఈ మూడు నెలలు ఓటు వేసిన ప్రతి ప్రేక్షక దేవుడి దగ్గరకు పర్సనల్‌గా వెళ్లి అందరినీ హాగ్‌ చేసుకుని వాళ్ల మీద నాకున్న ప్రేమను చాటుకుంటాను. వారు యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడ ఉన్నా వెళతాను. వారితో నా సమయం గడిపి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను…. అని కౌశల్ అన్నారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లిన వెంటనే అందరూ అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు రిలేషన్స్ పెట్టుకున్నారు. ఈ రిలేషన్స్ అన్నీ ఆ మూడు నెలల కోసమే, ఆ గేమ్ కోసమే అని తెలుసు. మన ఒకరిని అక్కా అంటే బిగ్‌బాస్‌లో ఉన్నంత సేపు మనల్ని నామినేట్ చేయరు. మనం ఎన్ని తప్పలు చేసినా తప్పని చెప్పరు. ఈ గొడవ అంతా ఎందుకని నేను ఎవరితోనూ రిలేషన్స్ పెట్టుకోలేదు. నేను బిగ్‌బాస్ ఇంట్లో బంధాలు పెట్టుకుంది ముగ్గురితోనే. ఒకటి మైడియర్ బిగ్ బాస్‌తో, రెండు మై స్వీట్ హార్ట్ నానితో, మూడోది మై లవ్లీ పీపుల్ ఆడియన్స్‌తో మాత్రమే. అందరూ ఇంట్లో వారితో బంధాలు పెట్టుకుంటే… నేను ఇంటి బయట ఉన్న వారితో బంధాలు పెట్టుకున్నాను. ఆ బంధాల విలువ ఏమిటో నాకు తెలుసు. ఇంట్లో ఉన్న వారికి ఇపుడు తెలుస్తుంది… అని కౌశల్ అన్నారు.

4bసెకండ్ వీక్‌లో నేను అంతగా ఫోకస్ చేయలేదు. ఫస్ట్ వీక్ లోనే ఇన్ని గొడవలు ఏంటి అనుకున్నాను. అంతా కలిసి నా మీద ఎటాక్ చేస్తున్నారని డిప్రెస్ అయ్యాను. ఎప్పుడైతే కిరీటి గొడవ అయిందో నాని గారు ఒకటే చెప్పారు… కౌశల్ నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కోసం నువ్వు ఆడాలి అన్నారో అప్పుడు నా నరనరాల్లో కసి పెరిగింది. నేను గేమ్ గెలిచి ఫ్యాన్స్ రుణం తీర్చుకోవాలనుకున్నాను… అని కౌశల్ అన్నారు.నాకు జన్మనిచ్చిన తల్లి ఒకటే చెప్పింది. పుట్టామా? జీవించామా? చనిపోయామా? అని కాదు… జీవితం అంటే పుట్టామా.. సాధించామా.. చనిపోయామా.. చనిపోయిన తర్వాత కూడా మన పేరు పది కాలాల పాటు ఉండాలని… నేను అదే ఆదర్శం తో ముందుకు వెళ్లడం జరిగింది. సెకండ్ వీక్ లో నానిగారు నన్ను మోటివేట్ చేసిన విధానంతో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను… అని కౌశల్ అన్నారు.బిగ్ బాస్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత మిత్రులు చెప్పారు. 39 కోట్ల ఓట్లు వచ్చాయని… ఇదంతా కౌశల్ ఆర్మీ వల్లే సాధ్యమైంది. కౌశల్ ఆర్మీ కౌశల్ కోసం ఫైట్ చేయడం మాత్రమే కాదు…. కేరళ వరద బాధితుల కోసం 50 లక్షలు కలెక్ట్ చేసి పంపించడం చాలా గొప్ప విషయం…అని కైశల్ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu