విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలి: హిజ్రా సంఘాలు

తమిళ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా నటించారు. త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాదు అభినయం చక్కగా ఉందంటూ విమర్శకులు, ప్రముఖులు నటీనటులపై ప్రశంసల జల్లు కురిపించారు.

కాగా ఇందులో విజయ్‌ హిజ్రా (శిల్పా) పాత్రలో కనిపించారు. డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తారు. అయితే ఈ సన్నివేశం పట్ల పలు హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమను ‘సూపర్‌ డీలక్స్‌’ లో తప్పుగా చూపించారని, కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిజ్రాలు ఎప్పుడు అలా కిడ్నాప్‌ చేశారని, పిల్లలకు ఎప్పుడు హాని కల్గించారని ప్రశ్నించాయి. విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి.

‘మాకు విజయ్‌ సేతుపతిపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఆయన ఈ సినిమాలో నటించి, దాన్ని నాశనం చేశారు. సినిమాలో ఆయన పిల్లల్ని కిడ్నాప్‌ చేశారు.. అలాంటి పనుల్ని మేం ఎప్పుడైనా చేశామా?, సినిమా స్క్రిప్టు విన్న తర్వాత విజయ్‌ నటించనని తిరస్కరించి ఉండాల్సింది’ అని హిజ్రా సంఘాలకు చెందిన కొందరు మీడియాతో అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates