HomeTelugu NewsTrisha: డబుల్ రోల్‌.. థాంక్యూ చిరు సార్‌!

Trisha: డబుల్ రోల్‌.. థాంక్యూ చిరు సార్‌!

Trisha in double role in Vi

Trisha: మెగస్టార్‌ చిరంజీవి, త్రిష 18 ఏండ్ల మరోసారి ‘విశ్వంభర’ లో జతకట్టనున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈసినిమాకి బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు హైదరాబాద్‌లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్‌లో త్రిష జాయిన్ అయింది.

అంతేకాదు ఈ సందర్భంగా చిరంజీవి నుంచి ఓ ప్రత్యేకమైన కానుకను అందుకుంది త్రిష. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో షేర్ చేసుకుంది. ఉష్టోగ్రతను నియంత్రించే స్మార్ట్‌ మగ్‌ను త్రిషకు బహుమానంగా అందించారు. చాలా ఖరీదైంది.. ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే నా స్మార్ట్‌ మగ్‌. చిరు సార్.. ధన్యవాదాలు అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ఇప్పుడీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా త్రిష ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ లో చూడబోతుందట. ఆమె పాత్రకు కథ లో అత్యంత కీలకమైన ప్రాముఖ్యత ఉంటుందని కూడా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో త్రిష ఎక్కువ సమయం స్క్రీన్‌ ప్రజెన్స్‌ దక్కించుకునే అవకాశం దక్కింది. ఈ సినిమాలో చిరంజీవి, త్రిష తో పాటు సురభి, రమ్య, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియో మిలియన్ల సంఖ్యలో డిజిటల్‌ వ్యూస్‌ రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్‌ సినిమాపై ఆసక్తిని కలిగించింది.

ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో స్టైలిష్‌ వాక్‌తో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉన్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!