HomeTelugu Newsవెబ్ సీరీస్ బాటపడుతున్న మరో హీరోయిన్‌

వెబ్ సీరీస్ బాటపడుతున్న మరో హీరోయిన్‌

9 5సినీ ఇండస్ట్రీ మూతపడటం వలన ఓటిటిలే జనాలకు పెద్ద దిక్కులా మారాయి. కరోనా కారణంగా థియేటర్లు మూసేయడంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ఇక చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో తమ సినిమాలు విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఓటిటిలకు మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పటి నుంచే హీరోయిన్లుగా తమ స్థానాలను కన్ఫర్మ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెబుతున్నారు.

స్టార్‌ హీరోయిన్‌లు కాజల్.. సమంత.. తమన్నా.. వంటి బిజీ తారలు ఇప్పడు వెబ్ సీరీస్ బాటపడుతున్నారు. ఈ క్రమంలో మరో ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది. తమిళ ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించనున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో త్రిష తండ్రి పాత్రలో మరో స్టార్ యాక్టర్ కనిపిస్తాడట. చూడాలి మరి అమ్మడి వెబ్ సిరీస్ లైఫ్ ఎలా ఉండబోతుందో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!